పోలీసు లాంఛనాలతో స్వామినాథన్‌ అంత్యక్రియలు

M.S. Swaminathan cremated with police honours in Chennai - Sakshi

సాక్షి, చెన్నై: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ పారి్థవ దేహానికి శనివారం చెన్నైలో తమిళనాడు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వయో సంబంధ ఆరోగ్య సమస్యలతో స్వామినాథన్‌ (98) చెన్నైలో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

అదే రోజు రాత్రి తరమణిలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. శనివారం ఉదయం 11 గంటలకు తరమణి నుంచి ప్రత్యేక వాహనంలో పారి్థవదేహాన్ని బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం స్వామినాథన్‌ పారి్థవ దేహాన్ని విద్యుత్‌ శ్మశాన వాటికలో దహనం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top