బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. 

Mother Saves Her Son From Being Attacked By Cow At Gujarat - Sakshi

బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అ‍క్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 

దీంతో​, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top