
ఘజియాబాద్: అత్తాకోడళ్లకు సంబంధించిన వివాదాలను తరచూ వింటుంటాం. ఒకరికి ఒకరు పొసగని నేపధ్యంలో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇటువంటి వ్యవహారాలు వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.
गाजियाबाद के गोविंदपुरम में बहू ने सास को गिरा-गिराकर पीटा।
1 जुलाई की घटना, पूरी वारदात सीसीटीवी में कैद। pic.twitter.com/5ReTffAIcs— Greater Noida West (@GreaterNoidaW) July 6, 2025
ఘజియాబాద్‌లోని గోవింద్‌పురం ప్రాంతంలో ఒక కోడలు అత్తపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని కంటెంట్ ప్రకారం కోడలు అత్తపై దాడి చేస్తుండగా, దానిని ఆ కోడలి తల్లి చిత్రీకరిస్తోంది.వారి ఇంటి బయట ఉన్న మెట్లపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ సమయంలో అత్త తన కోడలి తల్లి నుంచి ఫోన్ లాక్కోవడాన్ని కూడా గమనించవచ్చు. ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం కోడలి పేరు ఆకాంక్ష, అత్త పేరు సుదేష్ దేవి. ఈ ఘటన దరిమిలా సుదేష్ దేవి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.