దారుణం.. వాటర్‌ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం | Missing 5 Year Old Girl Body Found In Water Tank In Bhopal, Police Suspect Its Murder | Sakshi
Sakshi News home page

దారుణం.. వాటర్‌ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం

Sep 26 2024 9:35 PM | Updated on Sep 27 2024 10:50 AM

Missing 5 year old girl body found in water tank in Bhopal

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న  మరో ఇంటి వాటర్‌ ట్యాంక్‌లో శవమై తేలింది. అయితే నిందితులు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, డ్రోన్‌లతో పాటు ఐదు పోలీసు స్టేషన్‌ల నుండి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు.  

అనుమానాస్పద ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం వెయ్యికి పైగా ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. 72 గంటల తర్వాత చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లింది. దీంతో అనుమానంతో ఇంటిని తినిఖీ చేయగా.. ఇంటిపైన ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం లభ్యమైంది.

 పాప ఆచూకీతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చిన్నారి నివసిస్తున్న ఇల్లు..నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement