హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మణిపూర్ అల్లర్లపై విచారణకు హోంశాఖ ఆదేశం

MHA Appoints Committee for Inquiry in Manipur Violence - Sakshi

ఇంఫాల్: ఇటీవల జరిగిన మణిపూర్ అల్లర్లపై విచారణకు గౌహతి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ. 

కమిటీలో ఎవరెవరున్నారంటే... 
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మాట ప్రకారం కేంద్ర  హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. 

ఈ త్రిసభ్య కమిటీలో మిగిలిన ఇద్దరిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ కాగా మరొకరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్. కమీషన్ల విచారణ చట్టం 1952(60 ఆఫ్ 1952) లోని సెక్షన్-3 ప్రకారం ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, విచారణను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆరు నెలల లోపే నివేదిక సమర్పించాలని కోరింది కేంద్ర హోంశాఖ.    

హైవే మీద అడ్డంకులను తొలగించండి... 
ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువులను చేరవేసేందుకు వీలుగా ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై ఉంచిన అడ్డంకులను తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఇది కూడా చదవండి: ఒడిశా పోలీస్ సీరియస్ వార్నింగ్..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top