ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్‌పీఎఫ్ జవాన్‌కి గాయాలు

Maoist Blast In Chhattisgarh On Election Day - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్‌ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. 

విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్‌పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్‌ తెలిపారు. జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్‌ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. 

ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top