మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు! | Malaysian Wife Cares For Bedridden Husband for 6 Years But is Jilted After His Recovery | Sakshi
Sakshi News home page

మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!

Nov 1 2024 8:51 AM | Updated on Nov 1 2024 12:33 PM

 Malaysian Wife Cares For Bedridden Husband for 6 Years But is Jilted After His Recovery

భార్యకు విడాకులిచ్చి మరొకరితో పెళ్లి

మంగళూరులో ఘరానా భర్త నిర్వాకం

బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.

ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement