'పిల్లల్నిఅందుకే కనమని చెప్పా'.. వీకే నరేశ్ క్లారిటీ | Vk Naresh Clarity On Children without Marriages Comments | Sakshi
Sakshi News home page

Vk Naresh: 'పిల్లల్నిఅందుకే కనమని చెప్పా'.. వీకే నరేశ్ క్లారిటీ

Oct 15 2026 8:10 AM | Updated on Oct 15 2026 8:36 AM

Vk Naresh Clarity On Children without Marriages Comments

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ తాను చేసిన కామెంట్స్‌పై స్పందించారు. ఇటీవల క్రేజీ కల్యాణం మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనాలని మాట్లాడారు. ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌షిప్‌ అఫీషియల్‌ అయిపోయిందన్నారు. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చెప్పింది వేరని.. సోషల్ మీడియాలో మాట్లాడేది వేరుగా ఉందని నరేశ్ తెలిపారు.

(ఇది చదవండి: రజినీకాంత్ జైలర్ 2 ట్విటర్‌ రివ్యూ.. ఆడియన్స్‌ ఏమన్నారంటే?)

తాజా ఇంటర్వ్యూలో నరేశ్ తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. మనదేశంలో జనాభా తగ్గిపోతోందని.. అందుకే అలా చెప్పానని తెలిపారు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా పెళ్లిళ్లు చేసుకున్నా.. చేసుకోకపోయినా పిల్లల్ని కనాలని చెప్పానని అన్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి భయపడుతున్నారని వెల్లడించారు. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా ఆ పని చేయాలని సూచించానని తెలిపారు. నేను చెప్పింది రాంగ్ వేలో తీసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు చేస్కోండి.. ఎర్త్‌ను ఖాళీ చేయొద్దని వీకే నరేశ్ క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement