దేశవ్యాపంగా సంక్రాంతి సందడి | Sakshi
Sakshi News home page

Makar Sankranti: దేశవ్యాపంగా సంక్రాంతి సందడి

Published Mon, Jan 15 2024 8:37 AM

Makar Sankranti 2024 Will be Celebrated Today - Sakshi

ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. 

వారణాసిలోని గంగా ఘాట్‌కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు.

మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు.

ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. 

ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?

Advertisement
Advertisement