రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు | Madhya Pradesh PG Student Gets Rs 46 Crore Tax Notice | Sakshi
Sakshi News home page

రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు

Mar 31 2024 5:15 AM | Updated on Mar 31 2024 5:26 AM

Madhya Pradesh PG Student Gets Rs 46 Crore Tax Notice - Sakshi

పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్‌ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు.

తన పాన్‌ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్‌ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement