పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రార్థన | Lucknow First Test Tube Baby Is Mother Of A Baby Girl | Sakshi
Sakshi News home page

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రార్థన

Apr 12 2022 8:41 PM | Updated on Apr 12 2022 8:47 PM

Lucknow First Test Tube Baby Is Mother Of A Baby Girl - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మొదటి టె‍స్ట్‌ ట్యూబ్‌ బేబీ (ఐవీఎఫ్‌) అయిన 23 ఏళ్ల ప్రార్థన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శనివారం అజంతా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె తన చిన్నారితో పాల్గొన్నారు. ఐవీఎఫ్‌ పద్ధతిలో 1998లో ప్రార్థన అజంతా ఆస్పత్రిలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీగా జన్మించింది. ఈ కార్యక్రమంలో ప్రార్థన మాట్లాడుతూ.. ఐవీఎఫ్‌ సంబంధించి ఆస్పత్రి నిర్వహించే కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుందని తెలిపారు.

డాక్టర్‌ గీతా కన్నాతో ప్రార్థన

సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ప్రార్థన పేర్కొన్నారు. స్కూల్‌లో చదువుతున్న సమయంలో తాను ఒక టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అని తన తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు సాధారణ పిల్లల మాదిరిగా తనను ఎలాంటి అంతరాలు చూపకుండా పెంచారని చెప్పారు.

తన తల్లిదండ్రులు చాలా ఉత్నతమైన ఆలోచనలు కలవారని పేర్కొన్నారు. వారు ఎప్పడూ డాక్టర్‌ గీతా కన్నాతో టచ్‌లో ఉంటారని చెప్పారు. ప్రార్థన ఐవీఎఫ్‌ ద్వారా మాల్తీ అనే మహిళకు జన్మించింది. తాను టెస్ట్ ట్యూబ్‌ బేబీగా సురక్షితంగా జన్మించడంలో ఎలాంటి సమస్య రాకుండా కృషి చేసిన డాక్టర్‌ గీతా కన్నా బృందానికి ప్రార్థన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement