Litre Of Petrol Costs One Rupee In Solapur On The Occassion Of Ambedkar Jayanthi, Details Inside - Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌: రూపాయికే లీటర్‌ పెట్రోల్‌

Apr 14 2022 9:08 PM | Updated on Apr 15 2022 9:09 AM

liter Of Petrol Costs One Rupee In Solapur - Sakshi

సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. 

ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఓనర్‌.. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ అని 500 మందికి పెట్రోల్​ఇచ్చారు. దీంతో ఆఫర్‌ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్‌ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

ఈ సందర్భంగా బంక్‌ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్‌ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement