తొలి క్యాబినేట్‌ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్‌ | liquor shop tasmac leakages chief minister vijays big crackdown on party fund | Sakshi
Sakshi News home page

తొలి క్యాబినేట్‌ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్‌

Jun 7 2026 8:35 AM | Updated on Jun 7 2026 10:40 AM

liquor shop tasmac leakages chief minister vijays big crackdown on party fund

చైన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ తొలి క్యాబినేట్‌ భేటీలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో నిధుల లీకేజీలు, అనధికారిక వసూళ్లు  మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  

టాస్మాక్ కార్యకలాపాల ద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 102 కోట్లు అనధికారికంగా "పార్టీ ఫండ్" రూపంలో పక్కదారి పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి విజయ్‌కు అధికారులు వివరించారు. గత ఐదేళ్లలో దాదాపు రూ.1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్లించబడ్డాయని అంచనా వేస్తున్నారు. దీంతో టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌లలో చాలా కాలంగా నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ విషయమై తమిళనాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ " అవినీతి ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదు. లీకేజీలను వెంటనే అరికట్టండి, ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు చేర్చండి." అని మంత్రికి చెప్పినట్లు తెలిపారు. ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సాధారణ మద్యం కేస్‌పై దాదాపు రూ. 90, బీర్ కేస్‌పై దాదాపు రూ. 40, మరియు వైన్ కేస్‌పై రూ. 20 చొప్పున రాజకీయ లేదా మంత్రిత్వ నిధుల కోసం అనధికారికంగా వసూలు చేసి మళ్లించేవారని తెలుస్తోంది. ఈ వసూళ్లు వేర్‌హౌస్‌లు, రవాణా, రిటైల్ దుకాణాల వ్యాప్తంగా జరిగేవని అధికారులు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 88 లక్షల మంది వినియోగదారులు టాస్మాక్ ద్వారా మద్యం కొనుగోలు చేస్తుండగా.. నెలకు కనీసం రూ. 102 కోట్లు అనధికారిక మార్గాల్లోకి వెళ్తున్నట్లు అంతర్గత అంచనాలు చెప్తున్నాయి.

ఈ బాటిల్ రిటర్న్ వసూళ్లలో జరుగుతున్న అక్రమాల వల్ల మాత్రమే ప్రతి నెలా దాదాపు రూ. 300 కోట్ల అవినీతి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లీకేజీలను అరికట్టడానికి ఆ రూ. 10 డిపాజిట్‌ను నేరుగా ఎమ్‌ఆర్‌పీ ధరలోనే కలపడం లేదా డిజిటల్ రీఫండ్ విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూన్ చివరి నాటికి ఖాళీ బాటిళ్ల సేకరణ బాధ్యతలను అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని మంత్రి విఘ్నేష్ స్పష్టం చేశారు.

717 టాస్మాక్ దుకాణాల మూసివేత

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న సంచలన  నిర్ణయాలలో రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ రిటైల్ దుకాణాలను మూసివేయడం ఒకటి. ఈ షాపులను మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆదాయం తగ్గినప్పటికీ, ఆ నష్టాన్ని పూడ్చడానికి మద్యం ధరలను పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement