పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : గంగాపురం కిషన్ రెడ్డి గురువారం కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. కిషన్‌రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్, రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవ్య, ఉక్కుశాఖ మంత్రిగా ఆర్‌సీపీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.