Kerala OTT Platform: భారత్‌లో తొలిసారి.. కేరళ రాష్ట్ర సొంత ఓటీటీ 

Kerala To Launch Indias First State Owned OTT Platform On November 1 - Sakshi

తిరువనంతపురం: వచ్చే నవంబర్‌ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ నిర్వహించినట్లవనుంది. సీ స్పేస్‌ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్‌ ఫిల్మŠస్‌ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెప్పారు.

ఓటీటీలో అంతర్జాతీయంగా, జాతీయంగా అవార్డులు సాధించిన చిత్రాలను కూడా ప్రదర్శిస్తామన్నారు. కేరళ రాషŠట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్‌ సహకారంతో ఈ ఓటీటీని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుత ఓటీటీలకు భిన్నంగా కొన్ని ఫీచర్లను ఈ ఓటీటీలో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు. 
చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే.. తాఖీర్ రజా వ్యాఖ్యలపై దుమారం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top