నన్‌ అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకోని నిర్దోషిగా ప్రకటించిన కేరళ కోర్టు

Kerala Court Acquits Bishop Franco Mulakkal In Nuns Molesting Case - Sakshi

Bishop Franco Mulakkal: కేరళలో నన్‌పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది. ఈ మేరు 2018లో జలంధర్ డియోసెస్ పరిధిలోని ఒక నన్‌ 2014 నుంచి 2016 మధ్యకాలంలో బిషప్ ఫ్రాంకో తన పై  పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లైంగిక  ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు బిషప్ ఫ్రాంకోని అరెస్టు చేశారు.

అంతేకాదు మరోవైపు పోలీసులు, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నన్‌లు వీధుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేశారు. అయితే ఒక నన్‌ ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం కేసులో అరెస్టయిన భారతదేశంలోని తొలి క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్.  ఆ తర్వాత సుమారు 100 రోజులకు పైగా సాగిన విచారణ తర్వాత కోర్టు అతనిని అన్ని అభియోగాల నుండి విముక్తి చేసింది. ఈ మేరకు ఫ్రాంకో ములక్కల్ పోలీసులకు, కోర్టుకు సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. 

(చదవండి: ప్రైవేట్‌ ఆస్పత్రిలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top