Kejriwal Reply After PM Modi Congratulates AAP For Its Victory In Punjab Elections - Sakshi
Sakshi News home page

PM Modi: పంజాబ్‌లో ప్రభంజనం.. ‘ఆప్‌’కు మోదీ అభినందనలు.. కేజ్రీవాల్‌ రిప్లై ఇదే

Published Fri, Mar 11 2022 3:30 PM

Kejriwal Reply After PM Modi Congratulates AAP For Its Victory In Punjab - Sakshi

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆప్‌ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచినందుకు ఆప్‌ పార్టీకి అభినందనలు. పంజాబ్‌ అభివృద్ధికి  కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానికి ‘ధన్యవాదాలు సర్‌’ తెలిపారు.

కాగా పంజాబ్‌లో ఆప్‌ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌లను ఆప్‌ ఊడ్చి పారేసింది. 117 స్థానాలకు గాను రికార్డు స్థాయిలో 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఏ పార్టీలో పొత్తు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  అంతేగాక ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్‌ తిరగరాశారు. 
చదవండి: పంజాబ్‌ రాజకీయాల్లో కొత్త చరిత్ర.. ఫలించిన కేజ్రివాల్‌ ఎనిమిదేళ్ల కష్టం 

1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం ఈ ఎన్నికల్లో చోటుచేసుకుంది. అయితే బీజేపీ, అకాలీదళ్‌ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 18, శిరోమణి అకాలీదళ్‌ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి.
చదవండి: ఆప్‌ స్వీప్‌కి భయపడే బీజేపీ ఈసీకి లేఖ రాసింది

Advertisement

తప్పక చదవండి

Advertisement