పేలిన బ్యాటరీ స్కూటర్‌ | Karnataka: Electric Scooter Explodes In Mandya | Sakshi
Sakshi News home page

పేలిన బ్యాటరీ స్కూటర్‌

Apr 1 2023 9:18 PM | Updated on Apr 1 2023 9:29 PM

Karnataka: Electric Scooter Explodes In Mandya - Sakshi

మండ్య(బెంగళూరు): మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పేలి కాలిపోయింది. శుక్రవారం నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కాగా, స్థానిక పరీక్షా కేంద్రానికి ప్రకాశ్‌ అనే ఉపాధ్యాయుడు తన బ్యాటరీ స్కూటర్‌లో వచ్చాడు. దానిని బయట పార్కు చేసి ఉంచాడు.

సుమారు 12 గంటల సమయంలో బ్యాటరీ స్కూటర్‌ పెద్ద శబ్ధంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. పక్కనున్న మరో నాలుగు పెట్రోల్‌ బైక్‌లకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదగా మారిన తమ వాహనాలను చూసి యజమానులు లబోదిబోమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement