
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే కీలక అభ్యర్థుల్లో సోన్‌బార్సా నుండి రత్నేష్ సదా, మోర్వా నుండి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుండి ధుమల్ సింగ్, రాజ్‌గిర్ నుండి కౌశల్ కిషోర్ ఉన్నారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి.. సరాయ్ రంజన్ నుంచి పోటీ చేయనున్నారు.
Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0
— ANI (@ANI) October 15, 2025
ఆలంనగర్ నుంచి నరేంద్ర నారాయణ్ యాదవ్, బీహారీగంజ్ నుంచి నిరంజన్ కుమార్ మెహతా, సింగేశ్వర్ నుండి రమేష్ రిషి దేవ్, మాధేపురా నుండి కవితా సాహా, మహిసి నుండి గండేశ్వర్ షా, కుశేశ్వరస్థాన్ నుంచి అతిరెక్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇతర ప్రముఖ అభ్యర్థుల విషయానికొస్తే అనంత్ కుమార్ సింగ్ (మొకామా), శ్యామ్ రజక్ (ఫుల్వారీ), కౌశల్ కిషోర్ (రాజ్‌గిర్), ధుమల్ సింగ్ (ఎక్మా), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్‌పూర్), రత్నేష్ సదా (సోన్‌బర్సా), సంతోష్ కుమార్ నిరాలా (రాజ్‌పూర్), మదన్ సాహ్ని (బహదూర్‌పూర్), శ్రీష్వా సింఘ్‌పూర్‌పూర్), (గైఘాట్) విద్యా సాగర్ సింగ్ నిషాద్.. మోర్వా నుంచి పోటీ చేస్తున్నారు.