
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు ప్రభుత్వరంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం చెప్పింది.
దీంతో నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్‌సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్‌ఎఫ్‌సీ అవతరించాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సోమవారం వెల్లడించింది. కంపెనీల ఆర్థిక పనితీరు, నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాలను కేంద్రం మంజూరు చేస్తుంది.