వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం ఆస్పత్రి

Indian Man Works From Hospital While Wife Gives Birth, viral on social media   - Sakshi

కోవిడ్‌-19 కారణంగా ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులకు గంటల తరబడి జర్నీ చేసే బాధ తప్పింది. డబ్బులు కూడా సేవ్‌ చేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇంటిని మేనేజ్‌ చేస్తూ ఆఫీస్‌ పనిచేయడం కష్టంగా మారింది. పరిస్థితులు ఎలా ఉన్నా వర్క్‌ ఫ్రం హోం చేయాల్సి వస్తుంది. 

ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో సదరు ఉద్యోగి వర్క్‌ ఫ్రం హోంని కాస్తా.. వర్క్‌ ఫ్రం హాస్పటల్‌గా మార్చాడు. ఆస్పత్రికి చెందిన ఓ వార్డ్‌లో భార్య అప్పుడే పుట్టిన పాపాయికి జోకొడుతుంటే.. పక్కనే ఓ టేబుల్‌పై ల్యాప్‌ ట్యాప్‌తో భర్త ఆఫీస్‌ పనిచేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

సామ్ హోడ్జెస్ అనే నెటిజన్‌ వర్క్‌ ఫ్రం హాస్పిటల్‌ ఫోటోల్ని నెట్టింట్లో షేర్‌ చేయగా..ఏప్రిల్‌ 2న "నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తండ్రిగా పిల్లలకు దూరంగా ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను. అయినా వర్క్‌కి నేను కట్టుబడి ఉన్నా వర్క్‌ ఫ్రం హోం కంటే వర్క్‌ ఫ్రం హాస్పటల్‌ నుంచి వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల్ని, క్లైంయింట్లను" మేనేజ్‌ చేస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.     

చదవండి: రెండేళ్ల వరకూ వర్క్‌ ఫ్రం హోం.. ఎంతమందంటే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top