‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్‌ ఫైర్‌

India Rejects China Invented Name For Arunachal Pradesh - Sakshi

న్యూఢిల్లీ:అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్‌ తిరస్కరించింది.

‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్‌ చైనాది అయిపోదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే’ అని రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు.

చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్‌ ప్రదేశ్‌.. భారత్‌లో అంతర్భాగమని మర్చి 28న భారత్‌ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్‌ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్‌ ప్రదేశ్‌లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉ‍న్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top