100 కోట్ల డోసులు సిద్ధం చేసేలా ప్రణళిక

India May Get 100 Million Doses of AstraZenecas  Vaccine by Dec 2020 - Sakshi

న్యూఢిల్లీ  : డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కోవిడ్‌  వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రాజెన్‌కా వెల్లడించింది.  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు భారత్‌లో సంయుక్తంగా తయారు చేస్తోన్న 'అస్త్ర జెనికా' అనే కరోనా వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అదార్‌ పూనవాలా అన్నారు. కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద బిలియన్‌ (వంద కోట్ల) డోసులను డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డోసులన్నీ భారత్‌కు వెళ్లనున్నాయని పూనవాలా ఓ  ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. (నాలుగు కోట్ల డోసులు సిద్ధం)

ఇప్పటివరకు 40 మిలియన్‌ మోతాదుల ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికీ  వ్యాక్సి్న్ అందడానికి 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.  కొవిడ్ టీకాలు భారత్ లో అందరికీ అందించాలంటే రూ. 80, 000 కోట్లు అవసరం అని  ఈ మేరకు పూనావాల గత సెప్టెంబర్ నెలలోనే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్‌ ప్రయోగాలు చివరిదశలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. మరోవైపు  రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి హైదరాబాద్‌కు చేరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా భారత్‌లో సుమారు 2వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్‌ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నారు. (భారత్‌ చేరుకున్న రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top