నాలుగు కోట్ల డోసులు సిద్ధం | Preparations for Oxford vaccine Covishields final test | Sakshi
Sakshi News home page

నాలుగు కోట్ల డోసులు సిద్ధం

Nov 13 2020 4:01 AM | Updated on Nov 13 2020 5:01 AM

Preparations for Oxford vaccine Covishields final test - Sakshi

బెంగళూరు: కోవిడ్‌ టీకా తయారీలో ఇంకో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా గురువారం ప్రకటించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే నోవావాక్స్‌ టీకా తయారీ కూడా చేపడతామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్‌ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి.

టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌లో తయారు చేస్తున్న సీరమ్‌  నాలుగు కోట్ల డోసులు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం.∙తయారైన డోసులు అంతర్జాతీయ వినియోగానికా? భారత్‌లో పంపిణీ చేసేందుకా తెలిపేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిరాకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement