I2U2 Summit: భారత్‌లో యూఏఈ పెట్టుబడులు | I2U2 Summit: UAE 2 billion dolleers and US, Israel tech for India food parks | Sakshi
Sakshi News home page

I2U2 Summit: భారత్‌లో యూఏఈ పెట్టుబడులు

Jul 15 2022 6:09 AM | Updated on Jul 15 2022 7:45 AM

I2U2 Summit: UAE 2 billion dolleers and US, Israel tech for India food parks - Sakshi

ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్‌పార్కుల అభివృద్ధికి 2 బిలియన్‌ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) ఖర్చు చేస్తామని ప్రకటించింది.

అలాగే గుజరాత్‌లో హైబ్రిడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను భారత ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పార్కులతో రైతులను అనుసంధానించనున్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. ‘అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇనీషియేటివ్‌’పై ఆసక్తి చూపిన భారత్‌ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్‌ స్వాగతించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement