వీడియో: పట్టపగలే బైక్‌ నుంచి మనీ బ్యాగ్‌ గాయబ్‌.. ఎలా పోయిందో చూడండి

How UP Monkey Stole Money Bag Video Viral - Sakshi

Monkey Stole Money Viral రాత్రికి రాత్రే నసీబ్‌ మార్చుకుని కోటీశ్వరులైన మనుషుల కథల్ని విని ఉంటాం. కానీ, ఓ కోతి పట్టపగలే.. అదీ అడ్డదారిలో కొన్ని గంటలపాటు లక్షాధికారిగా మారిపోయిందట. ఇది సోషల్‌ మీడియాలో పేలుతున్న జోక్‌ మాత్రమే. 

ఉత్తర ప్రదేశ్‌ షాహాబాద్‌లో జరిగిన ఓ సరదా ఘటన.. ఓ వ్యక్తిని కాసేపు ఆగమాగం చేసింది. ఓ కోతి లక్షా యాభై వేల నగదు ఉన్న సంచిని ఓ మోటర్‌ సైకిల్‌ నుంచి ఎత్తుకెళ్లింది. 

షరాఫత్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి సేల్‌ డీడ్‌ కోసం నగదుతో రిజిస్ట్రీ ఆఫీస్‌ వచ్చాడు. ఆ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చింది. పార్కింగ్లో ఉన్న ఒక్కో బ్యాగ్‌ను వెతుక్కుంటూ ముందుకెళ్లింది.  అయితే.. దాని కన్ను డబ్బులున్న షరాఫత్‌ బ్యాగ్‌ మీదే పడింది. అంతే.. నైస్‌గా దానిని ఎత్తుకెళ్లింది.

కాసేపటికి బండి దగ్గరకు వచ్చిన ఆయన డబ్బు లేకపోయేసరికి దొంగతనం జరిగిందేమో అనుకుని లబోదిబోమన్నాడు. ఈలోపు కొందరు బ్యాగ్‌ కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడంతో దాని కోసం వెతికారు. అది కాస్త దగ్గర్లోని ఓచెట్టుపై నిమ్మలంగా కూర్చుని ఉంది. చాలాసేపు ప్రయత్నించాకే.. అది ఆ బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షరాఫత్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top