ఆ ఊర్లో మహిళలు దుస్తులే ధరించరు.. 5 రోజుల పాటు! | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ ఇదేం ఆచారం.. ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండానే ఉంటారట!

Published Sun, Jun 18 2023 2:02 PM

Himachal Pradesh Pini Village Women Dont Wear Clothes - Sakshi

భారతదేశంలోని నివసిస్తున్న ప్రజలు.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ప్రత్యేకించి గ్రామాల్లో నివసించే ప్రజలు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఒక వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారట. సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడి మహిళలు దుస్తులు ధరించరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఒక కారణముందని అంటున్నారు. అదేంటంటే..!

ఈ గ్రామం ఎక్కడ ఉంది?
అవును, మనం మాట్లాడుకుంటున్న గ్రామం పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో, శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది, ఇందులో మహిళలు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరు. ఈ ఐదు రోజులు పిని గ్రామానికి బయటి వ్యక్తులెవరూ రాలేరు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కూడా దాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు.

మహిళలు బట్టలు ధరించరు
ఈ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించరు. మహిళులు వారి ఇంటి వద్దనే ఉంటారు, బయటకు రారు. మరోవైపు ఈ ఐదు రోజులు నియమనిష్టలతో ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తారట. ఈ సమయంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వారు మద్యం తాగలేరు, నాన్ వెజ్ తినరు. అంతే కాదు ఈ ఐదు రోజులు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.

గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు?
గ్రామస్తుల ప్రకారం, ఈ సంప్రదాయం పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మహిళకు చెడు జరుగుతుందని అక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇది పాటిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చూసి నవ్వకూడదట. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరి. 

సంప్రదాయం చరిత్ర
సంప్రదాయ చరిత్ర పుటలు ఆసక్తికరంగా ఉన్నాయి. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించాయి. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు ఎత్తుకెళ్లేవారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. 

చదవండి: చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement