హిమాచల్‌ప్రదేశ్‌లో కేబినేట్‌ విస్తరణ..7గురు మంత్రుల చేరికతో..

Himachal Pradesh Cabinet Expanded By Sukhvinder Singh Sukhu - Sakshi

హిమచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌ సింగ్‌ సుఖూ, ఉపముఖ్యమంత్రిగా ముఖేష్‌ అగ్నిహోత్ని డిసెంబర్‌ 11న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుఖ్విందర్‌ సింగ్‌ నేతృత్వంలోని హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి వర్గం ఆదివారం ఏడుగురు మంత్రుల చేరికతో కేబినేట్‌ విస్తర్ణ జరిగింది. దీంతో బలం తొమ్మిదికి చేరింది.

ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్టేకర్‌ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా...కొత్తగా చేరిన మంత్రుల్లో సోలన్‌ నుంచి పెద్ద ఎమ్మెల్యే ధని రామ్‌ షాండిల్‌, కాంగ్రా జిల్లాలోని జవాలి నుంచి చందర్‌ కుమార్‌, సిర్మౌర్‌ జిల్లాలోని షిల్లై నుంచి హర్షవర్థన్‌ చౌహాన్‌, గిరిజన కిన్నౌర్‌ జిల్లా నుంచి జగత్‌ సింగ్‌ నేగి, అలాగే రోహిత్‌ ఠాకూర్‌, అనిరుధ్‌ సింగ్‌, విక్రమాదిత్య సింగ్‌లు సిమ్లా జిల్లాలోని జుబ్బల్‌ కోట్‌ఖాయ్‌, కసుంప్టి, సిమ్లా రూరల్‌ తదితర ప్రాంతాల నుంచి మంత్రులను చేర్చారు. దీంతో ముఖ్యంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌తో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12 మందికి మించకుండా.. డిప్యూటీ స్పీకర్‌ పదవి తోపాటు మూడు సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. 

(చదవండి: జోష్‌గా సాగుతున్న జోడో యాత్ర..చొక్కా లేకుండా మద్దతుదారులు డ్యాన్సులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top