హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్‌.. | Heavy Rains In Himachal Pradesh Red Alert Issued | Sakshi
Sakshi News home page

Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్‌..

Jul 9 2023 10:38 AM | Updated on Jul 9 2023 11:04 AM

Heavy Rains In Himachal Pradesh Red Alert Issued - Sakshi

సిమ‍్లా: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తరఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి సంభవిస్తోంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది ప్రభుత్వం. వర్షాలకు కొండ చరియలు, మంచు కొండచరియలు  విరిగిపడే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.

నిత్యం పర్యటకులతో కిటకిటలాడే హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెక్కింగ్  కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పలు పర్యాటక ప్రాంతాల్లో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. అటు.. భారీ వర్షాలతో దేశ రాజధాని అతలాకుతలం అవుతోంది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో 153 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.  

ఇదీ చదవండి: ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement