బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్‌నెట్ బంద్‌ | Haryana Suspends Internet 24 Hours In Nuh District Over Braj Mandal Yatra, More Details Inside | Sakshi
Sakshi News home page

బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్‌నెట్ బంద్‌

Jul 21 2024 7:01 PM | Updated on Jul 22 2024 10:49 AM

Haryana suspends internet 24 hours in Nuh over Braj Mandal Yatra

చండీగఢ్: బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  గతేడాది చోటుచేసుకున్న  ఘర్షణలను  దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్‌ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్‌ ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. 

నుహ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయత్రం 6 గంటల వరకు ఇంటర్‌నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు హర్యానా అడిషినల్‌ చీఫ్‌ సెక్రటరీ( హోం ) అనురాగ్‌ రస్తోంగి తెలిపారు. అసత్యాలు, పుకార్లు.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంనేందుకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్(ఎక్స్‌)పై సస్పెన్షన్‌ విధించామని పేర్కొన్నారు.మరోవైపు.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా నుహ్‌ జిల్లా మొత్తం భద్రత  ఏర్పాట్లు చేసినట్ల పోలీసులు  తెలిపారు. 

గతేడాది జూలై 31న యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించి  ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, 15 మంది మృతి చెందారు.   రాళ్లు విసిరి.. కార్లకు నిప్పుపెట్టారు. అదే రాత్రి గురుగ్రామ్‌లోని ఓ మసీద్‌పై దాడి  ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. ఆ తర్వాత కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. అప్పడు సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్‌ కట్టర్ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement