అద్భుత ప్రదర్శన.. 50 లక్షల నజరానా: సీఎం

Haryana: Rs 50 Lakh Award For Their Women Hockey Team Players - Sakshi

Indian Women Hockey Team Wins Hearts: కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్‌ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్‌లో ఓడిన అమ్మాయిలు.. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్‌తో హోరాహోరీగా పోరాడారు. కానీ, చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top