అతి తీవ్ర తుఫాన్‌గా ‘హమూన్‌’ | Hamoon Intensifies Into Very Severe Cyclonic Storm | Sakshi
Sakshi News home page

అతి తీవ్ర తుఫాన్‌గా ‘హమూన్‌’

Oct 25 2023 8:27 AM | Updated on Oct 25 2023 9:15 AM

Hamoon Intensifies Into Very Severe Cyclonic Storm - Sakshi

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. దానికి ఇరాన్‌ సూచించిన ‘హమూన్‌’అని పేరు పెట్టారు.

భువనేశ్వర్‌/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. దానికి ఇరాన్‌ సూచించిన ‘హమూన్‌’అని పేరు పెట్టారు. అయితే ఒడిశాకు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి బంగ్లాదేశ్‌ కేసి సాగుతూ మంగళవారం రాత్రికి బలహీనపడింది. బంగ్లాదేశ్‌లో తీరం దాటేసరికి మరింత బలహీన పడుతుందని అధికారులు తెలిపారు.

హమూన్‌ ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 240 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులు, రాయలసీమలో ఈనెల 29వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుంది. 28 నుంచి కోస్తాంధ్రలో, 30 నుంచి రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
చదవండి: నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు  

Advertisement
 
Advertisement
Advertisement