డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు | Gurmeet Ram Rahim, 4 others acquitted in 2002 Ranjit Singh case | Sakshi
Sakshi News home page

డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు

Published Tue, May 28 2024 12:29 PM

Gurmeet Ram Rahim others acquitted 2002 Ranjit Singh Case

చంఢీగఢ్‌: గుర్మీత్‌ రాం రహీం సింగ్‌(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో పంజాబ్‌, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. 

ఈ  హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్‌ చేశారు. ఇవాళ హైకోర్టు ఇ​చ్చిన తీర్పుతో రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.

హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్‌ సింగ్‌. ఆయన జూలై 10, 2002న​  హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్‌ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ  ప్రత్యేక  కో​ర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement