Gujarat: Woman Fake Complaint Creates Robbery Story To Hide Son Act - Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌కు బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చి కట్టు కథ అల్లారు! చివరికి..

Dec 10 2021 1:23 PM | Updated on Dec 10 2021 4:34 PM

Gujarat woman Fake Complaint Creates Robbery Story To Hide Son Act - Sakshi

రాజ్‌కోట్‌: కొన్ని నేరాలు చూస్తుంటే నిజంగా కామెడిగా ఉంటాయి. అసలు వాళ్లు తెలియక చేస్తున్నారో లేక తెలిసి చేస్తున్నారో కూడా అర్థం కాదు. అచ్చం అలానే ఇక్కడొక తల్లికొడుకులు నేరాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు.

(చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ)

అసలు విషయంలోకెళ్లితే...జామ్‌నగర్‌లోని నవగం ఘేడ్ ప్రాంతంలో నివాసిస్తున్న ఒక మహిళ తన ఇంట్లో ముగ్గురు దొంగలు చొరబడి 11 తులాల బంగారపు గొలుసు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ దొంగను తన కొడుకు కొంత దూరం వెంబడించాడని పోలీసులకు చెబుతుంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేయడం ప్రారంభిస్తారు.

ఈ మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన కూడా ఎలాంటి అనుమానస్పద దృశ్యం కనిపించలేదు. దీంతో సదరు మహిళ కొడుకు బాబుని విచారించగా ఆ గొలుసు తాను విడాకులు తీసుకున్న మాజీ భార్య తల్లిదండ్రులు పెట్టిన గొలుసు  అని, తన గర్లఫ్రెండ్‌కి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చే నిమిత్తం అమ్మేసినట్లు చెబుతాడు. అంతేకాదు రెండు రోజుల క్రితం అతని అన్న బాబుని బంగారు గొలుసు గురించి ఆరా తీయడంతో కొడుకు చేసిన పనిని కప్పి ఉంచే ప్రయత్నంలో తల్లి  కొడుకులిద్దరూ కలిసి ఈ కథ అల్లినట్లు పోలీసులు నిర్థారించారు.

(చదవండి: సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!)

Advertisement
 
Advertisement
Advertisement