Neeli Bendapudi First women President: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ

Neeli Bendapudi First women President US Penn State University - Sakshi

Indian-origin professor Neeli Bendapudi: భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వచ్చిన బెండపూడి ప్రస్తుతం కెంటకీలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు.

(చదవండి: అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!)

ఈ మేరకు పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్‌ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది.

అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ.."పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం" అని అన్నారు. 

(చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top