జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి రాజనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరయ్యారు. అత్యాధునిక ఆయుధాలు ఆర్మీ ప్రదర్శించింది. బ్రహ్మోస్ క్షిపణులు, అర్జున్ ట్యాంకులు, కే-9 వజ్ర ఆకట్టుకున్నాయి. ధనుష్ ఆర్జిలరీ గన్స్, డాగ్ రాబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెన్సార్లు, కెమెరాల సహాయంతో ఎత్తైన కొండలు, కఠినమైన భూభాగాల్లో ప్రయాణించగల ఒక రోబోటిక్ డాగ్ ఆకట్టుకుంది.
మొట్టమొదటిసారిగా ఆర్మీ డే పరేడ్‌ను మిలిటరీ కంటోన్మెంట్ వెలుపల నిర్వహించారు. రాజస్థాన్‌లోని జైపూర్, మహల్ రోడ్డులో వేలాది మంది ప్రజల సమక్షంలో భారత సైన్యం తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. పరేడ్‌లో కళ్ళద్దాలు ధరించిన K9 డాగ్స్ స్టైలిష్‌గా కవాతు చేశాయి. ముఖానికి కళ్ళద్దాలు, ఒంటిపై ఆర్మీ ప్రింట్ కోటులు ధరించి ఉన్న ఈ డాగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి భారత్)లో భాగంగా, భారత సైన్యం.. దేశీయ శునక జాతులను విధుల్లోకి చేర్చుకుంది. వీటిని నిఘా, పేలుడు పదార్థాల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ల సమయంలో గ్రెనేడ్ పేలుళ్లు సంభవించినప్పుడు ఎగిరిపడే ధూళి, శిథిలాల నుండి కళ్లను రక్షించుకోవడానికి ఈ కుక్కలకు కళ్ళద్దాలను ధరింపజేస్తారు.
🚨78th Army Day Parade In Jaipur 🇮🇳pic.twitter.com/7JzfYQhfb4
— P. (@_Real_PR) January 15, 2026


