ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్‌..

Govt Employee Openly Drinks Alcohol At Office - Sakshi

లక్నో:ప్రజలకు సేవచేయాల్సిన స్థానంలో ఉండి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ప్రభుత్వ ఆఫీసులు తమ సొంత నివాసాలుగా భావిస్తుంటారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో జల్సాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించాల్సిన సమయంలో కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు.  

ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో కపూర్‌ సింగ్‌ అనే అధికారి స్వైజ్‌పూర్‌ రిజిస్టర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీస్‌కు వచ్చి టేబుల్‌ మీదే దర్జాగా మద్యం సేవించారు. ఓ చేతిలో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో మద్యం సేవిస్తూ స్థానిక మీడియాకు చిక్కారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ కాగా.. నెటిజన్లు చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పంజాబ్‌లోని హోషియాపూర్‌లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్‌లోనే మద్యం సేవించిన ఘటన మరవకముందే యూపీలో ఈ ఘటన జరిగింది.  

ఇదీ చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top