కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆసరా

Govt Announces SchemeTo Provide Pension For Dependents Covid Victims - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ను ప్రకటించింది. కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)ల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా... ఎవరెవరు అర్హులో వివరిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఉద్యోగికి కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనాలు వర్తింపజేయాలని నిర్ణయించింది.

‘బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్‌ నిర్ధారణ జరగడానికి కనీసం మూడు నెలలు ముందుగా ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో  పేరు నమోదు చేసుకుని ఉండాలి. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్‌ నిర్ధారణ జరిగిన సంవత్సరానికి మునుపటి ఏడాదిలో నియమితుడై ఉండి, తన వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఈఎస్‌ఐసీ చందా చెల్లించి ఉండాలి’ అని పేర్కొంది. ఈ అర్హతలన్నీ ఉన్న ఉద్యోగులు కోవిడ్‌ వ్యాధితో మరణించిన పక్షంలో సదరు వ్యక్తులపై ఆధారపడిన వారికి, సంబంధిత ఉద్యోగి దినసరి వేతనంలో 90 శాతం చొప్పున మొత్తం నెలవారీగా పెన్షన్‌ను చెల్లిస్తారు. ఇది జీవితాంతం అందుతుంది. ఈ పథకం గతేడాది మార్చి 24 నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. 

►ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (ఈడీఎల్‌ఐ) పథకంలోనూ కొన్ని మార్పులు చేసింది.   
►మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. 
►కనీసం 12 నెలలపాటు ఒకే సంస్థలో కొనసాగుతూ ఈఎస్‌ఐ చందా చెల్లించాలనే నిబంధనను సడలించారు. ఏడాదికాలంలో ఒకటికి మించి సంస్థల్లో పనిచేసినా.. 2.5 లక్షల కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది.  
►కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే రూ. 2.5 లక్షల పరిహారానికి సంబంధించిన నిబంధనను గతేడాది ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చేలా పునరుద్ధరణ.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

31-05-2021
May 31, 2021, 03:49 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం...
31-05-2021
May 31, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర...
31-05-2021
May 31, 2021, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు....
30-05-2021
May 30, 2021, 21:45 IST
డెహ్రడూన్‌: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్...
30-05-2021
May 30, 2021, 18:33 IST
లండన్‌: కరోనా వైరస్‌ సహజంగా వచ్చింది కాదని... దాన్ని చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో రూపొందించారని యూరప్‌ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ...
30-05-2021
May 30, 2021, 16:56 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247...
30-05-2021
May 30, 2021, 16:01 IST
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు...
30-05-2021
May 30, 2021, 14:59 IST
చండీఘడ్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను విధించాయి. అయితే,...
30-05-2021
May 30, 2021, 14:25 IST
లక్నో: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. రక్త సంబంధీకులు దగ్గరకి రావడానికి జంకుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌...
30-05-2021
May 30, 2021, 13:13 IST
హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎంతటి దగ్గర వారైనా, బంధువులైనా ముఖం చాటేస్తున్న రోజులివి. సహాయం...
30-05-2021
May 30, 2021, 13:01 IST
డెహ్రాడూన్‌: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై...
30-05-2021
May 30, 2021, 12:07 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 46 రోజులతో పోల్చితే ఈ రోజు కోవిడ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి....
30-05-2021
May 30, 2021, 11:29 IST
అల్వాల్‌: అయినవారు ఆపదలో ఉన్నారని తెలిసినా కుంటి సాకులు చూపుతూ తప్పించుకుంటున్న ఈ విపత్కర సమయంలో ప్రార్థించే పెదవులకన్నా.. సహాయం...
30-05-2021
May 30, 2021, 09:27 IST
చెన్నై/గువాహటి: అనాథ బాలలకు, కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే...
30-05-2021
May 30, 2021, 09:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భయాందోళనలకు కారణమైన కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. దేశవ్యాప్తంగా...
30-05-2021
May 30, 2021, 04:49 IST
గుంటూరు మెడికల్‌: కోవిడ్‌–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఒక్కరోజులోనే...
30-05-2021
May 30, 2021, 04:27 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది...
30-05-2021
May 30, 2021, 04:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తూర్పుగోదావరి,...
30-05-2021
May 30, 2021, 00:54 IST
ప్రస్తుతం కేసులు, మరణాల తగ్గుదలను బట్టి చూస్తే జూన్‌ చివరికల్లా కరోనా నియంత్రణలోకి రావొచ్చు. అయితే లాక్‌డౌన్‌లో ఉన్నపుడు సహజంగానే...
29-05-2021
May 29, 2021, 21:42 IST
బీజింగ్‌: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని  గాంజావ్‌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top