
బనశంకరి: కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో కోవిడ్ మొదటి దశలో 23 మంది, రెండోదశలో 20 మంది, ఇదే జిల్లా చిక్కోడి పరిధిలో మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది మృతిచెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ విధుల్లో పాల్గొన్నవారిలో 10 మంది ఉపాధ్యాయులను కరోనా బలిగొంది. ప్రస్తుతం 53 మంది పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు.
(చదవండి: విషాదం: కుటుంబంలోని నలుగురు మృతి)