విషాదం: కుటుంబంలోని నలుగురు మృతి

Karnataka: Govt Teacher Family Died Due To Corona Virus - Sakshi

యశవంతపుర: కరోనా భూతం ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకున్న ఘటన బాగలకోట తాలూకా దేవినాళ గ్రామంలో జరిగింది. వెంకటేశ్‌ ఒంటగోడి (45) అయన భార్య రాజేశ్వరి (40), రాజేశ్వరి తండ్రి రామనగౌడ (74), తల్లి లక్ష్మీబాయి (68)లు బలయ్యారు. మే 3 నుండి 15 వరకు వీరందరూ బాగలకోటలోని కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుసగా మృతి చెందారు. రాజేశ్వరి ప్రభుత్వ టీచర్‌ కాగా, భర్త వెంకటేశ్‌ రామదుర్గలో ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అధికారి. ఇటీవల బెళగావి ఉప ఎన్నికలలో పనిచేసిన రాజేశ్వరికి మొదట కరోనా సోకింది. తరువాత కుటుంబసభ్యులందరికీ వ్యాపించింది. మరోవైపు బాగలకోట జిల్లా వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు మైనుద్దీన్‌ నబివాలె (57) కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top