దేవీ శరన్నవరాత్రులు: ప్రధాని మోదీ అద్భుత గిఫ్ట్‌, మాస్టర్‌ పీస్‌! | Sakshi
Sakshi News home page

దేవీ శరన్నవరాత్రులు: ప్రధాని మోదీ అద్భుత గిఫ్ట్‌! వీడియో వైరల్‌

Published Sat, Oct 14 2023 6:59 PM

Garba Song Written By PM Modi Released Ahead of Navratri Video viral - Sakshi

యావద్దేశం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీరాసిన ‘గర్బా’ సాంగ్ శనివారం రిలీజైంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ఈ పాట విడుదలైన  9 గంటల్లో 1.9 మిలియన్ల  వ్యూస్‌తో దూసుకు పోతుండటం విశేషం. 

ఈ సందర్బంగా టీం మొత్తానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని ఈ పాటకు సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు. చాలా యేళ్ల క్రితం రాసిన గర్బా సాంగ్  ఇది అని  పేర్కొన్నారు.  చాలా జ్ఞాపకాలను ఇది గుర్తు చేస్తోందన్నారు. ​కొన్ని సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేక పోయినప్పటికీ గత కొన్ని రోజులనుంచి  ఈ కొత్త గర్బా పాట రాసానని, నవరాత్రి  శుభ సందర్భంగా  దీన్ని పంచుకుంటున్నా అంటూ  మోదీ ప్రకటించారు.

ఈ గార్బో(గార్బా) పాటను ధ్వని భానుశాలి ఆలపించగా,  తనిష్క్ బాగ్చి  స్వరపర్చారు. 190 సెకన్ల   ఈ వీడియోను  దసరా సందర్భంగా   విడుదల చేశారు.  నటుడు, నిర్మాత జాకీ భగ్నాని సొంత నిర్మాణ సంస్థ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై  దీన్ని రూపొందించారు.

అద్భుతం,మాస్టర్‌ పీస్‌
దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మోదీజీ ఈ పాట రాశారంటే నమ్మలేకపోతున్నాం. గొప్ప సాహిత్యం, మంచి సంగీతంతో చాలా మంచి పాట అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నవరాత్రికి ఈ పాట చరిత్ర సృష్టించబోతోంది. ఈ మాస్టర్ పీస్ గిఫ్ట్ ఇచ్చినందుకు లవ్ యూ మోదీ జీ అంటూ మరొకరు  వ్యాఖ్యానించారు. 

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement