ఢిల్లీలో హైటెన్షన్‌... నలుగురు మాజీ సీఎంల అరెస్ట్‌ | Tension In Delhi, Four Former CMs Arrested During CJP Protests At Jantar Mantar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హైటెన్షన్‌... నలుగురు మాజీ సీఎంల అరెస్ట్‌

Oct 10 2026 3:40 PM | Updated on Oct 10 2026 5:07 PM

Four former CMs arrested during CJP protests in Delhi

సాక్షి, ఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతుంది. జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనకు  బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జంతర్‌ మంతర్‌ వద్దకు వస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మాజీ సీఎంలు పినరయి విజయన్‌,మాణిక్ సర్కార్‌ను అరెస్టు చేశారు. దీంతో జంతర్‌ మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో బస్ స్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆమె పార్టీకి చెందిన పలువురు ఎంపీలతో పాటు అదుపులోకి తీసుకున్నారు. మమతాతో పాటు ఆమె పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. నిరసన సమయంలో మమతా బెనర్జీ నోటికి బ్యాండేజ్ వేసుకుని కూర్చున్నారు.

అరెస్టుల అనంతరం మమత మాట్లాడూతూ "ప్రభుత్వం మాతో దురుసుగా ప్రవర్తిస్తోంది.ప్రజల గొంతును బలోపేతం చేయడానికి మేము, భారత కూటమిగా, మా పోరాటాన్ని కొనసాగిస్తాము," అని ఆమె అన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ పోలీసుల నిర్బందంలో ఉండగా  నిరసనలో చేరడానికి తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు.కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లతో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియంలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు.

కాగా సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సీజేపీ నిరసనకు మద్దతుగా వస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలకు తరలివస్తున్న సీజేపీ నేతలు అభిజిత్‌ దీప్కే, సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాను విమానంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి.సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళలనలకు ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

పినరయి విజయన్ అరెస్ట్


ఇదీ చదవండి: అభిజిత్‌ దీప్కే ఇంట్లో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement