తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష | Former Tehelka editor Tarun Tejpal sentenced to 10 years | Sakshi
Sakshi News home page

సంచలనం.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

Aug 6 2026 2:57 PM | Updated on Aug 6 2026 5:54 PM

Former Tehelka editor Tarun Tejpal sentenced to 10 years

ముంబై: 33ఏళ్ల తర్వాత ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ మేగజైన్ తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు జైలు శిక్ష ఖరారైంది. 2013లో లిఫ్ట్‌ ఎలివేటర్‌లో తన జూనియర్‌ సహోద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో బాంబే హైకోర్టు ఆయనకు గురువారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..2013లో తెహల్కా ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న తరుణ్‌ తేజ్‌పాల్‌ ఆ ఏడాది నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓహెటల్‌ లిఫ్ట్‌లో తనపై తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అతని జూనియర్‌ ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేశారు.

కేసు నమోదు చేసిన గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2017లో గోపా ముపాస ట్రైల్‌ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణపై తేజ్‌పాల్ గోవా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన గోవా హైకోర్టు తరుణ్‌ తేజ్‌పాల్‌ నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును తప్పుపడుతూ గోవా ప్రభుత్వం తదుపరి న్యాయం కోసం వెంటనే పైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గోవాకు బాంబే హైకోర్టే ఎగువ న్యాయస్థానం కావడం వల్ల, ప్రభుత్వం ఈ అప్పీల్‌ను బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్‌లో దాఖలు చేసింది. ఆ అప్పీల్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు గోవా బెంచ్, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు షాక్

బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సందేకర్‌లతో కూడిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 376 (2)(f), 354(a), 354(b) కింద తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్ష అనుభవించడానికి కోర్టు ఆయనకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ లోపు జైలు అధికారుల లేదా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

కోర్టు విచారణ సందర్భంగా తేజ్‌పాల్ తాను ఒక రాజకీయ బాధితుడినని, తనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తన వయస్సు ప్రస్తుతం 62 ఏళ్లు కాబట్టి శిక్ష విషయంలో కనికరం చూపాలని కోరారు.అయితే గోవా ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. తేజ్‌పాల్‌కు కఠిన శిక్ష విధించాలని గట్టిగా వాదించారు. సమాజానికి బలమైన సందేశం వెళ్లాలని ‘ఒక మహిళ 'వద్దు' అని చెబితే దానికి 'వద్దనే' అర్థం అని ఆయన కోర్టులో స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తేజ్‌పాల్‌కు జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తాము త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తరుణ్ తేజ్‌పాల్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement