337 విమానాలు ఆలస్యం | Sakshi
Sakshi News home page

337 విమానాలు ఆలస్యం

Published Fri, Dec 29 2023 5:10 AM

Fog disrupts operations at Delhi airport in 337 flights delayed - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కష్టాలు వదలట్లేవు. వరుసగా నాలుగో రోజు దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 337 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు.

ఈ ఎయిర్‌ పోర్టు నుంచి ప్రతి రోజు దాదాపు 1200ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కాగా.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ప్రతి ఏడాది చలి కాలంలో నెల నుంచి నెలన్నర రోజులు ఇలాంటి పరిస్థితి తలెత్తడం సాధారణం.

Advertisement
Advertisement