breaking news
air traffic interrupts
-
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
337 విమానాలు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కష్టాలు వదలట్లేవు. వరుసగా నాలుగో రోజు దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 337 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు దాదాపు 1200ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కాగా.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రతి ఏడాది చలి కాలంలో నెల నుంచి నెలన్నర రోజులు ఇలాంటి పరిస్థితి తలెత్తడం సాధారణం. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
పొగమంచుతో విమాన రాకపోకలకు ఆటంకం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తిరుపతి, విశాఖపట్టణం, బెంగళూరు, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా వెళ్లనున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గోవా, విజయవాడ, లండన్‌కు విమానాలు రద్దు చేసినట్టు వెల్లడించారు. మిగతా ప్రాంతాల్లోనూ మంచు ప్రభావం ఉండడంతో ఇక్కడి రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వివరించారు. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వస్తోంది.