కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని నమ్మిన కుటుంబం...18 నెలలుగా ఇంట్లోనే ఉంచి....

Family Believed Dead Son Was Alive Kept Body 18 Months At Home - Sakshi

కాన్పూర్‌: ఒక కుటుంబం కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని చెబుతూ 18 నెలలుగా ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడు ఆదాయపు పన్ను అధికారి విమలేష్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఐతే అతనికి పెట్టి ఉ‍న్న ఆక్సిమీటర్‌ తప్పుడూ రీడింగ్‌ చూపించడంతో అతను బతికే ఉన్నాడని కుటుంబం నమ్ముతోంది.

విమలేష్‌ తల్లి ఆ ఆక్సిమీటర్‌ని చూసి తన కొడుకు బతికే ఉన్నాడని బలంగా నమ్మడంతో కుటుంబ సభ్యులంతా అతడు బతికే ఉన్నాడనుకన్నారు. అందుకే ఆ అధికారి విమలేష్‌  మృతదేహాన్ని దహనం చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబసభ్యులను విచారించారు. విచారణలో...తల్లిని నమ్మి విమలేష్‌ మృతదేహాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐతే మృతుడి భార్య మితాలీ దీక్షిత్‌ మాత్రం చనిపోయినట్లు తనకు తెలుసునని కానీ కుటుంబ సభ్యులంతా బతికే ఉన్నాడని చెప్పడంతో నమ్మానని చెప్పింది.

ఆమె తన భర్త కార్యాలయంలో కూడా అతను చనిపోయినట్లు తెలియజేశానని, కానీ కుటుంబసభ్యలు అనారోగ్యంతో ఉన్నట్లు ఒక లేఖను పంపించారని తెలిపింది. అంతేగాదు వారు 18 నెలలుగా చనిపోయిన వ్యక్తి జీతాన్ని కూడా పొందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శరీరానికి ఉన్న ఆక్సిమీటర్‌ తప్పడు రీడింగ్‌ చూపిస్తోందని తెలిపారు. ఇక పోలీసులే జోక్యం చేసుకుని కుటుంబంతో బలవంతంగా సదరు మృతుడికి దహన సంస్కారాలు జరిపించారు.

అంతేగాదు పోలీసులు కుటుంబం సంప్రదించిన వైద్యులు వివరాలను కూడా సేకరించడమే గాక కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మృతుడు విమలేష్‌ సోదరుడు దినేష్‌ మాత్రం ఎలాంటి ఇన్వెస్టిగేషన్‌ చేయకుండా బలవంతంగా దహన సంస్కారాలు చేసేశారు, ఇప్పుడేమో విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ వాపోతున్నాడు. అతేగాదు సీఎం పోర్టల్‌లో పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. 

(చదవండి: పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top