బాబోయ్‌ కల్తీ కరోనా వ్యాక్సిన్లు..నీళ్లు పోసి అమ్మేస్తున్నారు? | Fake Remdesivir Vials Found In Punjab | Sakshi
Sakshi News home page

నకిలీ రెమిడెసివిర్ వ్యాక్సిన్లు.. హెచ్చరిస్తున్న పోలీసులు

May 7 2021 4:06 PM | Updated on May 8 2021 8:05 AM

Fake Remdesivir Vials Found In Punjab - Sakshi

చండీగఢ్: దేశంలో రోజు రోజుకి కరోనా వైరస్‌ కేసులు లక్షల్లో నమోదవుతుంటే వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో  దేశంలో కరోనా వ్యాప్తిని,మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత‍్నాల్ని ముమ్మరం చేశాయి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దీన్ని అదునుగా భావించిన కేటుగాళ్లు కల్తీ కరోనా వ్యాక్సిన్లతో సొమ్ము చేసుకుంటున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం రూప్‌ నగర్‌ పట్టణ సమీపంలో ఉన్న భాక్రా డ్యామ్‌ కెనాల్‌ లో రెమిడెసివిర్‌ కరోనా వ్యాక్సిన‍్లను గుర్తించినట్లు సాలెంపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ చంకౌర్ సాహిబ్ స్థానిక ఎస్సై, డ్రగ్‌ ఇన్ప్సెక్టర్‌, సీనియర్‌ మెడికల్‌ అధికారులను ఘటనస్థలానికి పంపి సోదాలు జరిపించారు. ఈ సోదాల్లో నకిలీ కరోనా వ్యాక్సిన్‌ రెమిడెసివిర్‌తో పాటు మరో ప్రాంతంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వినియోగించే సెఫోఫెరాజోస్‌ డ్రగ్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రూప్‌ నగర్‌ "సీనియర్‌  సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామస‍్తుల సమాచారంతో సెఫోపెరాజోన్, రెమెడిసివర్‌ లు కలిపి మొత్తం 1200 వ్యాక్సిన్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం. అయితే డ్రగ్‌ అధికారులు పరిశీలించగా నకిలీ వ్యాక్సిన్లని తేలింది. కేటుగాళ్లు కావాలనే ధనార్జనే కోసమే నకిలీ వ్యాక్సిన్లను తయారు చేశారు. మేం దాడులు చేస్తామని  తెలుసుకొని భాకక్రా డ్యామ్‌ లో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. త‍్వరలోనే నిందితుల్ని అరెస్ట్‌ చేస్తాం. కరోనా బాధితులు వ్యాక్సిన్‌ కొనుగోలు చేసే సమయంలో ఒరిజినలా? నకిలీవా"అనేది గుర్తించాలని అన్నారు.  

ఇది చదవండి : కోవిడ్‌ నిర్ధారణకు స్వాబ్‌ ఇస్తున్నారా? ఈ వీడియో చూడండి

ఇది చదవండి : కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడెసివర్‌

Advertisement
 
Advertisement
Advertisement