ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు | Earthquakes in North India | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు

Nov 4 2023 5:21 AM | Updated on Nov 4 2023 6:54 AM

Earthquakes in North India - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో శుక్రవారం రాత్రి భూప్రకంపలను సంభవించాయి. నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఉత్తర ప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిసింది.

నేపాల్‌లో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా నమోదయ్యింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ(ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూకంప కేంద్రం భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు తెలియజేసింది. నేపాల్‌లో భూకంపం చోటుచేసుకోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి.  నేపాల్‌లో తాజా భూకంపంలో ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement