పతనంతిట్ట: రాబోయే యాత్రా కాలంలో శబరిమల సన్నిధానం, పంబ, నిలక్కల్, చుట్టుపక్కల అటవీ ప్రాంతాలలో అనధికారిక ప్రయోజనాల కోసం డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. భద్రతా సంస్థలు అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే జిల్లా పోలీస్ చీఫ్ నుండి ముందస్తు అనుమతితో డ్రోన్లను నడపడానికి అనుమతించనున్నారు. ఈ సీజన్లో భారీ సంఖ్యలో యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నందున ఈ నిషేధాన్ని విధించారు. అనధికారిక డ్రోన్ కార్యకలాపాలు యాత్రికుల భద్రతకు, గోప్యతకు ముప్పు కలిగించవచ్చని, భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించవచ్చని, చుట్టుపక్కల అడవులలోని వన్యప్రాణులకు ఆటంకం కలిగించవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇదేవిదంగా పంబ-సన్నిధానం మార్గంలో నవంబర్ 11, 2026 నుండి జనవరి 25, 2027 వరకు అనధికారిక రోడ్డు పక్కన అమ్మకాలు నిషేధించారు.. వడస్సేరిక్కర అట్టతోడ్ మధ్య ఉన్న పుణ్యక్షేత్రాల వెంట పశువులను కట్టేయడం లేదా మేపడం కూడా నిషేధించారు. కాగా అగ్ని ప్రమాదాల నివారణ భద్రతా చర్యలలో భాగంగా, లాహా సన్నిధానం మధ్య ఉన్న హోటళ్లలో ఒకేసారి గరిష్టంగా ఐదు గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో గ్యాస్ సిలిండర్లను అసురక్షితంగా నిల్వ చేయడం, పుణ్యక్షేత్రాల మార్గాలలో, నీలక్కల్లో, పార్కింగ్ ప్రదేశాలలో వాహనాల దగ్గర వంట చేయడాని నిషేధించారు. యాత్రా కాలం సమీపిస్తున్నందున, భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు.
ఇదీ చదవండి: పులి దాడి వీడియోతో కంట తడిపెట్టించిన ట్రంప్!


