
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల్లో కొలువైన ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం తెరచుకున్నాయి. తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువును తొలిరోజే దర్శించుకునేందుకు దేశ నలుమూలు సహా నేపాల్ నుంచి సైతం ఇప్పటికే భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు.
40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉదయం 4.30 నుంచి రాత్రి 9గం. వరకు దైవదర్శనానికి అనుమతిస్తారు. నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఉంది బద్రీనాథ్ పట్టణం. ఛార్‌ధామ్‌లో ఈ ప్రాంతం ఒకటి. బద్రీనాథ్.. నర నారాయణ పర్వత్ర శ్రేణుల్లో కొలువైంది. గర్హ్‌వల్ హిమాలయాలకు 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పట్టణం. అలకానంద నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంటుంది. జోషిమఠ్ పట్టణం బద్రీనాథ్‌కు ముఖద్వారంగా ఉంటుంది.
वैदिक मंत्रोच्चार एवं पूर्ण विधि विधान से खोले गए भगवान बदरी विशाल के कपाट, इसी के साथ चार धाम यात्रा का विधिवत शुभारंभ हुआ!!
जय बदरी विशाल 🚩#CharDhamYatra #BadrinathDham #Uttarakhand pic.twitter.com/ymnBMwdsJ1— विरक्त पहाड़ी (@ViraktPahadi) May 4, 2025